వైయ‌స్ జ‌గ‌న్‌తోనే రాజ‌న్న రాజ్యం సాధ్యం

వైయ‌స్ఆర్ జిల్లా: రాజన్న రాజ్యం రావాలంటే వైయ‌స్ జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్య‌త అంద‌రిపై ఉంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ  గల్ఫ్‌ కన్వీనర్‌ ఇలియాజ్, ఆ పార్టీ కువైట్‌ కమిటీ కన్వీనర్‌ ముమ్మడి బాలిరెడ్డి పేర్కొన్నారు. ఓబులవారిపల్లె మండలం వైకోట గ్రామానికి చెందిన సీడీ నాగేంద్ర పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా కువైట్‌లో ఉన్న మహేష్‌ యాదవ్, వైకోట గ్రామ ప్రజలు కువైట్‌లోని పార్వానియా ఒమేరియా పార్క్‌లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  
Back to Top