ఎంపీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు

నెల్లూరుః కోవ్వూరు నియోజకవర్గంలో ఎంపీ నిధులతో వైయస్సార్సీపీ నేతలు అభివృద్ధి పనులు ప్రారంభించారు.  కొడవలూరు, బుచ్చిరెడ్డిపాలెం మండలాల్లో సీసీ రోడ్లకు ఎంపీ నిధులు మంజూరయ్యాయి. సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించారు. అవినీతి పాలన సాగిస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని వైవీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాని గోవర్థన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top