అభివృద్ధి వైయ‌స్ జగనన్నకే సాధ్యం

గడివేముల:  రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల అభివృద్ధి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనే సాధ్య‌మ‌వుతుంద‌ని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రితారెడ్డి అన్నారు. చంద్ర‌బాబు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలు, రైతులు విసిగిపోయారని అన్ని వర్గాల ప్రజలు సుబిక్షంగా ఉండాలంటే వైయ‌స్ జ‌గ‌నన్న ముఖ్య‌మంత్రి కావాల‌ని ఆమె ఆకాంక్షించారు. శనివారం గడివేములలో వైయస్ఆర్‌ కుటుంబం కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజల కష్టనష్టాలను తెలుసుకొని రాబోయే రోజులు వైయస్సార్‌సిపికే అనుకూలిస్తాయని, రైతులు, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని భ‌రోసా క‌ల్పించారు. వైయ‌స్‌ జగనన్న ప్రవేశపెట్టనున్న నవరత్నాల పథ‌కాలతో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొంది తమ జీవితాల్లో ఆశల వెలుగులు నింపుకొనే వీలుంటుందన్నారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో కల్లబొల్లి మాటలతో గద్దెనెక్కి అభివృద్ధిని మరిచిన టిడిపికి బుద్ధి చెప్పి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుందామ‌న్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సత్యనారాయణరెడ్డి,  శివరామిరెడ్డి, కొరటమద్ది ఎంపిటిసి సబ్యుడు నాగేశ్వరరెడ్డి, చిందుకూరు సత్యంరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, శివారెడ్డి, ప్రతాపరెడ్డి, లోకేశ్వరరెడ్డి, విజయనాయుడు, మహేశ్వరరెడ్డి, వెంగళరెడ్డి, దుబ్బాశ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీకాంత్, రంగస్వామినాయక్,  త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top