పార్కుల అభివృద్ధి, పరిరక్షణ ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం

నెల్లూరుః రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి 27వ డివిజన్ లో ప్రజాబాట నిర్వహించారు. స్థానిక సమస్యలపై ప్రజలతో చర్చించారు. విక్రమ్ నగర్ లో ఎ.పి.ఐ.ఐ.సి నిర్వహిస్తున్న  పార్కు నిర్వహణ పనులను పరిశీలించారు. అనంతరం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ...నెల్లూరు నగరంలో అనేక చోట్ల రిజర్వ్ స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని ప్రజలకు ఉపయోగపడే రీతిలో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నగర కార్పొరేషన్ పై ఉందని అన్నారు. ముఖ్యంగా రిజర్వ్ స్థలాను పార్కులుగా అభివృద్ధి చేసినట్లయితే, ప్రజలతో ఎంతో మేలు కలుగుతుందని, పచ్చదనంతో నగరానికి శోభ వస్తుందని పేర్కొన్నారు. పార్కు స్థలాల పరిరక్షణ, అభివృద్ధి ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యం అవుతుందని అన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తాను ఇప్పటివరకు నగరంలో ప్రజల సహకారంతో 4 పార్కులను అభివృద్ధి చేశానని చెప్పారు. నగర కార్పొరేషన్ సహకారంతో మరో రెండు పార్కులను అభివృద్ధి చేస్తున్నానని, ఎ.పి.ఐ.ఐ.సి సహకారంతో విక్రమ్ నగర్ పార్కును అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, స్థానికులు పాల్గొన్నారు.

Back to Top