దేవినేని ఉమా ఓ గజ దొంగ

విజయవాడ: నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమాకు అన్ని స్కామ్‌ల్లో భాగస్వామ్యం ఉందని, ఆయన ఓ గజ దొంగ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే దేవినేని ఉమాను ఆయన సొంత నియోజకవర్గమైన మైలవరం ప్రజలే తరిమికొడతారని హెచ్చరించారు. విజయవాడలో బుధవారం వెల్లంపల్లి మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు తాను మారిన మనిషినంటూ నమ్మబలికి, అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులకు అండగా ఉంటాన న్న చంద్రబాబు ఈ మూడేళ్లలో అధికారులను ఎలా  ఇబ్బంది పెట్టారో రాష్ట్ర ప్రజలు, ఉద్యోగులకు తెలుసు అన్నారు. మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావును ఇబ్బంది పెట్టింది ఎవరు మరిచిపోలేదన్నారు. ఉద్యోగులకు వైయస్‌ఆర్‌సీపీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. మంత్రి దేవినేని ఉమా స్థాయికి మించి వైయస్‌ జగన్‌పై మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. దేవినేని ఉమా ఓ గజదొంగ అని అభివర్ణించారు. చంద్రబాబు నివాసం ఉంటున్న ప్రాంతంలో దేవినేని ఉమా తన అనుచరులతో ఇసుకను దోచుకుంటున్నారని విమర్శించారు. దొంగనే దొంగా దొంగా అని అరుస్తున్నారని, పోలవరం, పట్టి్టసీమలో ఎన్ని కోట్లు దోచుకున్నారో ప్రజలకు తెలుసు అన్నారు. ప్రతిపక్ష నేతను దేవినేని ఉమా విమర్శిస్తే చంద్రబాబు మెచ్చుకుంటున్నారన్న భ్రమలో ఉంటే మైలవరం నియోజకవర్గ ప్రజలే నీకు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ గజదొంగను త్వరలోనే ప్రజలు తరిమికొడతారని వెల్లంపల్లి  హెచ్చరించారు.

Back to Top