గరగపర్రు నిందితులను వెంటనే అరెస్టు చేయాలి

పొన్నూరుః పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం, గరగపర్రు దళితులను గ్రామ బహిష్కరణ చేసిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని వైయస్సార్‌ సిపి జిల్లా అధికార ప్రతినిధి గేరా సుబ్బయ్య డిమాండ్‌ చేశారు. స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్ధాలు అవుతున్నప్పటికీ దళితులను గ్రామ బహిష్కరణ చేసేవిధంగా టిడిపి ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి ఒకవైపు పూలమాలలు వేస్తూ మరోవైపు ఆయన విగ్రహాలను పెట్టనీయకుండా ముఖ్యమంత్రి నీచ రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. దళిత దళారులను అడ్డుపెట్టుకొని దళితులకు చెందాల్సిన ఎస్సీ ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆయన పేర్కాన్నారు. రాష్ట్రంలో దళితులంతా ఏకమై రానున్న రోజుల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతారని సుబ్బయ్య హెచ్చరించారు.

Back to Top