టీడీపీ హయాంలో విగ్రహాల ధ్వంసం

విజయవాడ : తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం పెరిగిపోయిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ అన్నారు. సింగ్‌ నగర్‌లో రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనా స్థలానికి వచ్చి ధ్వంసమైన రంగా విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడినవారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలని రాధాకృష్ణ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.  ఇలాంటి అనైతిక చర్యలు మానుకోకపోతే ప్రజలే గుణపాఠం చెబుతారని రాధా హెచ్చరించారు.

Back to Top