కృష్ణా జిల్లాకు పాకిన కొత్త ర‌కం దందా

కృష్ణా
జిల్లా లో కొత్త ర‌కం దందాకు తెలుగుదేశం నాయ‌కులు తెర దీస్తున్నారు.
భూముల‌కు ప‌రిహారం విష‌యంలో ర‌క ర‌కాల వ‌దంతులు వ్యాపింప‌చేసి. ప్ర‌జ‌ల్ని
భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేస్తున్నారు. లంక భూముల‌కు, అసైన్డ్
భూముల‌కు ప‌రిహారం ద‌క్క‌ద‌ని, ప్ర‌యోజ‌నాలు అందవంటూ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం
చేస్తున్నారు. అటువంట‌ప్పుడు ప్ర‌భుత్వం భూములు లాక్కొంటే ప‌రిహారం
ద‌క్క‌ద‌ని భ‌య పెడుతున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి లో ఇదే ర‌కం దందా చేసి
వంద‌ల ఎక‌రాల్ని గుంజేశారు. అదే తంతును కృష్ణా జిల్లా తెలుగుదేశం నాయ‌కులు
కొన‌సాగిస్తున్నారు. లంక భూముల్లో దందా నెరిపేందుకు ప‌న్నాగాలు
ప‌న్నుతున్నారు. 

త్వ‌ర‌లోనే ల్యాండ్ పూలింగ్ ఉంటుంద‌ని ,
అప్పుడు భూముల్ని లాగేసుకొని ప‌రిహారం ఇవ్వ‌ర‌ని ప్ర‌చారం చేసేస్తున్నారు.
ఇప్ప‌టికే ఈ ప్రాంతంలో భూమి రేట్లు కోట్ల రూపాయిల‌కు చేరుకొంది. అందుక‌ని
పేద‌ల భూముల్ని కొట్టేసేందుకు స్కెచ్ వేస్తున్నారు. విజ‌య‌వాడ శివారు
ఇబ్ర‌హీంప‌ట్నం మండ‌లం, చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో రెండున్న‌ర వేల
ఎక‌రాల్లో లంక భూములు ఉన్నాయి. దీంతో భూముల్ని లాగేసేందుకు ప్ర‌య‌త్నాలు
ముమ్మ‌రంగా ప్ర‌య‌త్నాలుజ‌రుగుతున్నాయి. డీ ఫారం ప‌ట్టా ఉంటే ఎక‌రానికి రూ.
18 ల‌క్ష‌లు, ప‌ట్టా లేకుండా 9, 10 ల‌క్ష‌లు చెల్లించి కొనేస్తున్నారు.
అదే ఎక్కువ రేటు అంటూ ద‌బాయిస్తున్నారు. త‌ర్వాత కాలంలో దీన్ని క‌న్వ‌ర్ట్
చేయించుకొని కోట్ల రూపాయిల‌కు సొమ్ములు చేసుకొనేందుకు రంగం సిద్దం
చేసుకొంటున్నారు. 
Back to Top