వైయస్సార్సీపీలో చేరిన తెలుగుతమ్ముళ్లు

అనంతపురం(హిందూపురం అర్బన్‌) : అవినీతి సర్కార్ పై ప్రజాపక్షాన నిరంతరం పోరాటం కొనసాగిస్తున్న ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ అడుగు జాడల్లో నడిచేందుకు రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. బాబు మోసపూరిత పాలనతో విసుగెత్తిన తెలుగుతమ్ముళ్లు వరుసగా ఆపార్టీని వీడుతున్నారు. వైయస్ జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హిందూపురం నియోజకవర్గ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్‌ సమక్షంలోకిరికెర బీసీ కాలనీకి చెందిన టీడీపీ నాయకులు వైయస్సార్‌సీపీలో చేరారు.

నవీన్‌నిశ్చల్‌ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా నవీన్‌నిశ్చల్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో హిందూపురం నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీ జెండా ఎగురవేయడం తథ్యమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ నాగభూషణరెడ్డి, మండల కన్వీనర్‌ బసిరెడ్డి, బీసీ సెల్‌æరాము, చాంద్‌బాషా, నక్కలపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ సర్పంచ్‌ సత్యనారాయణ, పి.రంగప్ప, జి.గోపాల్, తిరుమలేష్‌ తదితరులు పాల్గొన్నారు.
Back to Top