వైయ‌స్‌.జగన్‌తోనే ప్రజారంజక పాలన సాధ్యం

మదనపల్లె :

 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనే ప్ర‌జా రంజ‌క పాల‌న సాధ్య‌మ‌ని ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి అన్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రకటించిన నవరత్నాలతోనే నవ్యాంధ్ర ప్రజల సంక్షేమం సాధ్యమని చెప్పారు. మదనపల్లె పట్టణంలోని మిషన్‌ కాంపౌండ్‌ సీఎస్‌ఐ కమ్యూనిటీ హాల్‌లో శుక్రవారం ఎమ్మెల్యే దేశాయ్‌ తిప్పారెడ్డి అధ్యక్షతన నవరత్నాల సభ నిర్వహించారు. ఇందులో మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం మండలాలకు చెందిన కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కలిగింది. వారు ఉత్సాహంగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ అఖండ విజయం సాధిస్తుందని, జగనన్న ముఖ్యమంత్రి కావడం తథ్యమన్న నాయకుల ప్రసంగాలకు ప్రతిసారీ ఈలలు, అరుపులతో హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫర్జానా రఫీ, ఎస్‌.ఏ.మస్తాన్, బాలకృష్ణారెడ్డి, సర్పంచ్‌ శరత్‌కుమార్‌ రెడ్డి, నాగరాజరెడ్డి, ఎంపీటీసీ కత్తి లక్ష్మన్న, శ్రీకాంత్, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తి కృష్ణమూర్తి, చిప్పిలి జగన్నాథరెడ్డి, సోమశేఖర్‌ రెడ్డి, రవిచంద్రారెడ్డి, షరీఫ్, ఎస్‌.ఏ.కరీముల్లా, బుల్లెట్‌ షఫీ, బాబురెడ్డి, భువనేశ్వరి సత్య, ఆనంద పార్థసారధి, రోలింగ్‌ మల్లిక, గార్ల చంద్రమౌళి, ప్రసాద్‌ రెడ్డి, జన్నే రాజేంద్ర, పాల్‌ బాలాజీ, రుక్యాబేగం, కోటూరి ఈశ్వర్, అంబేడ్కర్‌ చంద్రశేఖర్, రెడ్డి శేఖర్, భాస్కర్‌ గౌడ్, కమాల్‌ ఖాన్, కృష్ణగోపాల్‌ నాయక్, రవీంద్ర రాయల్‌ తదితరులు పాల్గొన్నారు.  

తాజా ఫోటోలు

Back to Top