ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఎమ్మెల్యే ఆగ్రహం

చిత్తూరు(మ‌ద‌న‌ప‌ల్లె): అధికార పార్టీ ఎమ్మెల్యే ప్ర‌చార ఆర్భాటం ప్రోటోకాల్ వివాదాల‌కు దారి తీసింది.  ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల ప్రారంభంలో మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్.దేశాయి తిప్పారెడ్డికి కనీస ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో  ఆయ‌న తీవ్ర‌స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ప్రారంభించిన హౌస్‌ఫ‌ర్ఆల్ ప‌థ‌కానికి సంబంధించి స్థానిక మున్సిప‌ల్ కార్యాల‌యంలో పైలాన్‌ను ప్రారంభించారు. ఆ పైలాన్శిలాఫ‌ల‌కంలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ నిబంధ‌న‌ల మేర‌కు ఇవ్వాల్సిన ప్రాధాన్య‌త ఇవ్వ‌లేదు. నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యేగా మొద‌ట ముద్రించాల్సిన పేరును ఎనిమిదో పేరుగా ముద్రించారు. 

ప్రోటోకాల్‌లో లేని పేర్ల‌ను అధికార దుర్వినియోగంతో మొద‌టి నుంచి వ‌రుస క్ర‌మంలో ముద్రించారు. దీనిపై ఎమ్మెల్యే డాక్ట‌ర్ దేశాయి తిప్పారెడ్డి సీరియ‌స్ అయ్యారు. శిలాఫ‌ల‌కంపై ఎమ్మెల్యే పేరును ప్రాధాన్య‌త త‌గ్గించి ఎందుకు ముద్రించాల్సి వ‌చ్చిందో స‌మాధానం చెప్పాల‌ని హౌసింగ్ ఈఈ రాజేంద్ర‌కుమార్‌, డీ మునీశ్వ‌ర్ నాయుడుల‌ను ప్ర‌శ్నించారు. వారి వ‌ద్ద నుంచి స‌రైన స‌మాధానం రాక‌పోవ‌డంతో ప్రోటోకాల్ ఉల్లంఘ‌న చ‌ట్టం కింద చ‌ర్య‌ల‌ు తీసుకునేందుకు వెనుకాడ‌న‌ని హెచ్చ‌రించారు. అంతేకాకుండా స‌బ్‌క‌లెక్ట‌ర్‌, లోకాయుక్తాల‌కు ఫిర్యాదుల‌ను పంపారు.


 


తాజా ఫోటోలు

Back to Top