డేరా బాబా గురువు చంద్రబాబా

  • చంద్రబాబునే కేసీఆర్ విజయవాడ పటంలో పెట్టాడు
  • నంద్యాలలో బాబు అధికార, అండ, ధనబలం గెలిచింది
  • సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన దద్దమ్మ చంద్రబాబు
  • సీబీఐ ఎంక్వైరీ జరిగితే బాబు జీవితాంతం జైల్లోనే ఉంటాడు
  • బాబు పాలనకు నూకలు చెల్లాయి
  • 2019లో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని
హైదరాబాద్ః  వైయస్ జగన్ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని చంద్రబాబు, మంత్రులను హెచ్చరించారు. తన సొంత ఊరు నారావారి పల్లె ఉన్న నియోజకవర్గంలో ఓడిపోయిన చరిత్ర చంద్రబాబుదని దుయ్యబట్టారు. డబ్బు, ప్రలోభాలతోనే చంద్రబాబు నంద్యాలలో గెలిచాడని విమర్శించారు. డేరా బాబా గురువు చంద్రబాబా..?అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాదిరే డేరా బాబా కూడ ట్రస్ట్, పార్టీ,  ప్రజాస్వామ్యమని మహిళలను వంచించాడని ధ్వజమెత్తారు. డేరా బాబాకు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందన్నారు. తన బోటోళ్లు ఎవరైనా లేఖ రాస్తే, దానిపై సీబీఐ ఎంక్వైరీ జరిగితే చంద్రబాబ, ఆయన పార్టీ జీవితాతంతం జైల్లోనే ఉంటుందన్నారు.  హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే....

వైయస్ జగన్ ను వైయస్ఆర్ బెంగళూరులో దూరం పెట్టాడని చంద్రబాబుకు రోశయ్య చెప్పారట. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ఓ క్యాసెట్ రిలీజ్ చేసి నమ్మకద్రోహి, ఔరంగజేబు, బాబు లాంటి నీచుడు లేడని చెప్పారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సోదరుడు రామ్మూర్తినాయుడు కూడ బాబు ఎంత నీచుడో చెప్పారు. బామ్మర్దులు కూడ అదే చెప్పే పరిస్థితి ఉంది.  రామారావు కుటుంబసభ్యులే చంద్రబాబు దొంగ అని చెప్పిన పరిస్థితులున్నాయి.  నంద్యాలలో జగన్ దెబ్బకు బాబు భయపడ్డడు. కౌంటింగ్ అనుకూలంగా వచ్చాక తానే గెలిచానంటూ రాష్ట్రానికి ఆయనేదో ప్రధాని అయినట్టు సంబరాలు చేసుకుంటున్నాడు.  నిన్నటి ఎన్నికల్లో వైయస్సార్సీపీకి 40శాతం ఓట్లు వచ్చాయి. 56 శాతం టీడీపీకి వచ్చాయి. చంద్రబాబుకు అధికారం, డబ్బు, సానుభూతి అన్నీ కలిపితే 56శాతం వచ్చింది. నంద్యాల వైయస్సార్సీపీ సీటు కాబట్టే పోటీ చేశాం.  చంద్రబాబు ధన, అంగబలం ఉపయోగిస్తావని తెలిసి కూడ బాబు మాదిరిగా దొంగదారులు చూసుకోకుండా పోటీ చేసి పోరాటం చేసిన యోధుడు జగన్.

హైదరాబాద్ ను బాబు ప్రపంచపటంలో పెట్టానని మాట్లాడడం హాస్యాస్పదం. ఓటు నోటు కేసులో దొంగలా దొరికిపోతే  కేసీఆరే హైదరాబాద్ నుంచి తట్టా బుట్టా సర్దించి చంద్రబాబును విజయవాడ పటంలో పెట్టాడు.  చంద్రబాబు నీవు ఎలాంటోడివో, ఎలాంటి రాజకీయాలు చేస్తవో ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. బాబు నీకు దమ్ముధైర్యం ఉంటే... నీ పార్టీ మీద , అభివృద్ధి మీద నమ్మకముంటే మా పార్టీ నుంచి తీసుకుపోయిన 20మందితో రాజీనామా చేయించి గెలిపించుకొని రా. అప్పుడు రెఫరెండంగా స్వీకరిద్దాం. అప్పుడు చంద్రబాబో, జగనో రాష్ట్ర ప్రజలు తేలుస్తారు. బాబు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి బాబు ఆ పార్టీని తీసుకున్నాక అంచెలంచెలుగా తగ్గుతూ వచ్చాడు. 1999లో బీజేపీతో కలిసి పోటే చేస్తే 43 శాతం, 2004లో 37 శాతం, 2009 28 శాతం. ఆ తరువాత బై ఎలక్షన్ లో 22 శాతాం. 2014 మొన్నటి ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంతో కలుపుకుంటే 31 శాతం. చంద్రబాబు పార్టీ రోజురోజుకు తరుగుతుంది. వైయస్సార్సీపీ ఓ ఎమ్మెల్యే, ఎంపీతో మొదలై అధికారాన్ని చేపట్టే స్థాయికి అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వస్తోంది.  బాబు పాలనకు నూకలు చెల్లాయి. 2019లో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. 

చంద్రబాబు నాయుడు 2004 నుంచి 2014 దాకా పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నడు. ఆయన ప్రతిపక్షంలో ఉండగా  44చోట్ల అసెంబ్లీకి ఉపఎన్నికలు జరిగినయి. 44చోట్ల  ఎన్నికలు జరిగితే 21 చోట్ల డిపాజిట్లు కోల్పోయారు. 10 చోట్ల మూడో ప్లేస్ లో ఉన్నరు . మిగిలిన చోట్ల 30,40వేల మాధ్యమంతో ఓడిపోయారు. రెండు చోట్ల పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్లు పోగొట్టుకున్నడు. చంద్రబాబుకు ఇంత రాజకీయ అనుభవం ఉండి అంత పోటుగాడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 44చోట్ల ఎందుకు గెలుచుకోలేకపోయాడు. బొబ్బిలి నుంచి టీడీపీ పార్లమెంట్ సభ్యుడు చనిపోతే వాళ్ల అబ్బాయిని పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాడు. కాంగ్రెస్ అభ్యర్థి బొత్స ఝాన్సీ చేతిలో ఘోరంగా ఓడిపోయాడు. రాష్ట్రంలో, కేంద్రంలో ఉప ఎన్నికలు జరిగితే 99శాతం అధికారానికే అవకాశం ఉంటుంది. నంద్యాలలో చంద్రబాబు దాదాపు 2వేల కోట్ల అభివృద్ధి చేస్తానని జీవోలిచ్చాడు, 200కోట్లు పార్టీపరంగా ఖర్చుబెట్టాడు.  నాయకులు, ప్రజలను ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురిచేశాడు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి ఉంది. 250 మందికి పోస్టల్ బ్యాలెట్లు ఇచ్చారు. అంటే ఉద్యోగులు నీకు ఓటేయటం ఇష్టలేక రిటన్ పోస్ట్ కూడ చేయలేదు.  39 మంది ఎంప్లాయిస్ పోస్ట్ చేసినా రాంగ్ గా టిక్ పెట్టి డిస్ క్వాలిఫ్ చేయాలని చెప్పి ఓటేశారు. అంటే వారికి ఓటేయరాదని మీరు భావిస్తున్నారు. టీడీపీ మీద ఉన్న అసంతృప్తితో నిరసన తెలిపిందుకే ఉద్యోగస్తులు ఓటేయలేదు. రాష్ట్ర ప్రజలు కూడ తెలుసుకోవాలి. 

చంద్రబాబు, ఆయన మంత్రివర్గం చెబుతారు. పులివెందులలో జగన్ ఓడిపోయే పరిస్థితి ఉంటది పద్ధతి మార్చుకోమ్మని మాట్లాడుతున్నారు. పులివెందులలో జగన్ ఓడిపోవడం కాదు...నీ సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి టీడీపీ పుట్టినాక 8సార్లు ఎన్నికలు జరిగాయి. 83లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న చంద్రబాబుకు డిపాజిట్లు కూడ రాలేదు. 85లో టీడీపీ, 89లో కాంగ్రెస్, 94లో టీడీపీ గెలిచింది. చంద్రబాబు ఎన్టీఆర్ కు నమ్మకద్రోహం చేసి పార్టీ తీసుకున్నాక 4 సార్లు ఎన్నికలు జరిగాయి. 1999, 2004, 2009లో మూడుసార్లు కాంగ్రెస్ , 2014లో వైయస్సార్సీపీ గెలిచింది. అంటే నీ సొంత ఊరు నారావారి పల్లె ఉ్న నియోజకవర్గంలో గెలవలేని దద్దమ్మవు నీవు. నీవు, మంత్రివర్గం పులివెందులలో జగన్ ను ఓడిస్తానని సొల్లు ప్రగల్బాలు పలుకుతున్నారు. రాష్ట్ర ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలనే ఇవన్నీ చెబుతున్నాం. ఇందిరాగాధీ, రాజీవ్ గాంధీతో ఈయన పోరాటం చేశారట. ఇలాగే వదిలేస్తే పోర్చుగల్, డచ్, బ్రిటీష్ వాళ్లతో కూడ పోరాటం చేశానని చెబుతాడు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా 1978లో కాళ్లు పట్టుకొని చంద్రబాబు సీటు తెచ్చుకున్నాడు. 83లో అమ్మ ఆదేశిస్తే అన్నమీద పోటీ చేస్తానని సొల్లు ప్రగల్భాలు పలికి ఓడిపోయాడు. ఆయన ఇందిరాగాంధీ మీద ఏం పోరాటం చేశాడని నేను అడుగుతున్నా. 1984 నుంచి 89దాక రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు. ఆ టైంలో బాబు కనీసం శాసనసభ్యుడు కూడ కాదు. టీడీపీ ఆఫీసులో బాయ్ గా ఉన్నాడు.  చరిత్రను వక్రీకరించడం. స్వాతంత్ర్య సమరయోధుడిలాగ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల మీద పోరాటం చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు.  ఎన్టీఆర్ చేసినవి కూడ ఈయనే చేసినట్టు చెప్పుకుంటూ భ్రమల్లో బతుకుతున్నాడు. 


Back to Top