పెద్ద‌నోట్ల ర‌ద్దు చంద్ర‌బాబుకు ముందే తెలుసు

- వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి
ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ పెద్ద‌నోట్ల‌ను ర‌ద్దు చేసే విష‌యం చంద్ర‌బాబుకు ముందే తెలుసని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ త‌న కేంద్ర మంత్రుల ద్వారా ముందే విష‌యం తెలుసుకున్న చంద్ర‌బాబు  రూ.500లు, రూ.1000ల నోట్ల‌ను ర‌ద్దు చేయ‌మ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడికి అక్టోబ‌ర్ 12న లేఖ రాశార‌న్నారు. తెలుగుదేశం కండువా క‌ప్పుకుని, బీజేపీలో కేంద్ర మంత్రిగా ఉన్న వెంక‌య్య నాయుడు బాబుకు ముందే చెప్పార‌ని, అందుకే క్రెడిట్ అంతా త‌న ఖాతాలో వేసుకునేందుకు బాబు అలా చేశార‌ని పేర్కొన్నారు. బాబుకు ముందే తెలియ‌క‌పోతే ప్ర‌ధానికి లేఖ రాయాల‌నే ఐడియా ఎవ‌రికీ రాక ముందే ఆయ‌న ఎలా వ‌చ్చింద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని పెద్ద నోట్ల‌ను ర‌ద్దు చేయ‌డానికి మూడు రోజుల ముందే బాబు త‌న హెరిటేజ్ సంస్థ షేర్ల‌ను అమ్ముకున్నార‌ని గుర్తు చేశారు. న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్ట‌డాన్ని అంద‌రం స‌మ‌ర్థిస్తున్నామ‌ని కానీ కొంత‌మందికి విష‌యం చెప్పి.. ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేయ‌డం ఏం బాగోలేద‌ని మండిప‌డ్డారు. ప్ర‌జ‌లు చాలా ద‌య‌నీయ ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నార‌ని వాళ్ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంద‌న్నారు.

Back to Top