టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది

కడియం : డబ్బు, అధికారం, పోలీసు తదితర మార్గాల్లో ప్రజాస్వామ్యాన్ని అన్నివిధాలా టీడీపీ ఖూనీ చేసి నంద్యాలలో విజయం సాధించిందని వైయస్సార్‌ సీపీ రూరల్‌ కో ఆర్డినేటర్‌ గిరజాల వీర్రాజు అన్నారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని టీడీపీ నాయకులు అక్కడి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. భౌతిక దాడులకు దిగి భయాందోళనలు కలిగించారన్నారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇంతలా దిగజారిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు. పరిపాలనను పక్కన పెట్టి నంద్యాల ఉపఎన్నికపైనే దృష్టిపెట్టడం ద్వారా తమ చేతగానితనాన్ని టీడీపీ ఒప్పుకున్నట్లైందని గిరజాల అన్నారు. కాగా.. సెప్టెంబర్‌ 2వ తేదీన దివంగత నేత వైయస్‌ వర్ధంతిని పురస్కరించుకుని నియోజకవర్గంలో పార్టీ నాయకులు, ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.

Back to Top