ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచిన టీడీపీ

కాకినాడ: నంద్యాలలో చేసిన ప్రలోభాలు, బెదిరింపులను కాకినాడలో తెలుగుదేశం పార్టీ ఉపయోగించిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ కార్పొరేషన్‌ కైవసం చేసుకోవడానికి చంద్రబాబు విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి, అధికార దుర్వినియోగానికి పాల్పడి, పోలీసులను ప్రయోగించి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారన్నారు. కాకినాడలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని కన్నబాబు అన్నారు. కాకినాడ కార్పొరేషన్‌ ఎన్నికను టీడీపీ, వైయస్‌ఆర్‌ సీపీ మధ్య జరుగుతున్న ఎన్నికలా మార్చారన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కాకినాడలో తిష్టవేసి ఓట్లు వేయకపోతే పెన్షన్లు, ఇల్లు రాకుండా చేస్తామని బెదిరించిందన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top