నంద్యాలలో ప్రజాస్వామ్యం నవ్వుల పాలు

  • అన్ని వ్యవస్థల్ని భ్రష్టుపట్టించిన బాబు
  • ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలకు తిలోదకాలు
  • డబ్బులు, మద్యం ఏరులై పారిస్తున్న పచ్చనేతలు
  • ఎన్నికలు సజావుగా జరపాలని ఈసీ, గవర్నర్ ను కోరుతున్నాం
  • ఎన్నికను అపహాస్యం చేస్తున్న బాబు దురాగాతాల్ని మీడియా ఎండగట్టాలి
  • వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం
హైదరాబాద్ః నంద్యాల ఎన్నిక గెలవకపోతే బతుకుండదని, ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి, అరాచకాలకు పాల్పడుతోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, హైపవర్ కమిటీ అధ్యక్షుడు తమ్మినేని సీతారాం మండిపడ్డారు. వైయస్సార్సీపీ గెలిస్తే ఇక ఆపార్టీని కంట్రోల్ చేయలేమన్న కుతంత్రాలతో టీడీపీ నంద్యాలలో ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు జేస్తోందని ఫైర్ అయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు  నంద్యాలలో తిష్టవేసి పోలీస్ పహారాలో డబ్బులు, మద్యం ఏరులై పారించడం దారుణమని అన్నారు. రాత్రికి రాత్రే  శిలాఫలకాలు లేకుండా టెంకాయలు కొడుతున్నారని..దేవాలయాలు, దర్గాలు, ప్రార్థనామందిరాలని చెప్పి డబ్బులు పంచుతున్నారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు అన్ని వ్యవస్థల్ని భ్రష్టుపట్టించారని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందులో చూసినా అవినీతే కనిపిస్తోందన్నారు. బాబుకు గాలిచిక్కడం లేదు గానీ లేకపోతే దాన్ని కూడ లీటర్ లకొద్దీ ప్యాకెట్లు కట్టి అమ్ముకునేవాడని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం , రాజ్యాంగం విలువలు మంటకలిశాయని తమ్మినేని ఆవేదన వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా తెగించి అరాచకాలకు పాల్పడుతున్నారని టీడీపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. నా పెన్షన్లు, నా రోడ్లమీద తిరుగుతున్నారని మాట్లాడుతున్నావ్..? మీ అబ్బగారి రోడ్లా..? మీ అకౌంట్ లోంచి ఏమైనా ఇచ్చారా..? లేక  మీ నాయన ఖర్జూరనాయుడి అకౌంట్ లోంచి ఇచ్చావా..? మీరిచ్చినట్టయితే వరల్డ్ బ్యాంక్, ఆర్బీఐ నిధులెందుకు, ప్రభుత్వ బడ్జెట్ లెందుకు బాబూ..?  ఇది ఉన్మాదంతో కూడుకున్న మాటలు కాదా..!మాకు నీళ్లు లేవు, విద్యుత్ లేదు, అభివృద్ది జరగడం లేదని ప్రజలు అడిగితే వార్నింగ్ ఇస్తావా...? తమాషా ఆడుతున్నావా, కేసు పెట్టి తాటతీస్తానని ప్రజలను బెదిరిస్తావా..? ముఖ్యమంత్రినైనా, ప్రధానినైనా నడిరోడ్డులో నిలబెట్టి నిలదీసే హక్కు ప్రజలకు ప్రజాస్వామ్యం ఇచ్చింది. ముఖ్యమంత్రి అయి ఉండి కేసుపెడతానని ప్రజలను బెదిరిస్తారా..? పైశాచికత్వం తలకెక్కి అధికారమదంతో కొట్టుకుంటున్న మీరు ఉన్మాదిలా మాట్లాడుతున్నారంటూ చంద్రబాబుపై తమ్మినేని విరుచుకుపడ్డారు. 

చంద్రబాబు ఇచ్చిన 600 వాగ్ధానాలకు రాష్ట్ర ఆర్థికపరిస్థితి సహకరించదని ఎన్నికల సమయంలో ఈసీకి రిప్రజెంటేషన్ ఇచ్చాం. విశ్లేషణ చేయమని ఆ రోజు ఈసీకి లేఖపెడితే లేదు లేదు నాకు చాలా అనుభవం ఉంది. నేను వనరులను తులనం చేసుకోగలనని మాట్లాడాడు. రాజ్యాంగబద్ధమైన ఎన్నికల హామీని నెరవేర్చకపోగా పచ్చి నయవంచనతో ప్రజలను మోసగించాడు. బాబు మూడేళ్ల పాలన తీరుపై ప్రజలు ఆగ్రహిస్తున్నారు. రైతు, డ్వాక్రా రుణాలు , ఇంటికో ఉద్యోగం, ఉపాధి, నిరుద్యోగ భృతి, వ్యవసాయ రుణాలు ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపాన పోలేదు.  ప్రజాస్వామ్యంలో రాజ్యంగబద్ధమైన హక్కులను కాలరాసిన బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారు.  బుల్లెట్ కంటే  శక్తివంతమైన బ్యాలెట్ ద్వారా ప్రజలు నీకు అధికారాన్ని కట్టబెడితే ఏవిధంగా నయవంచన చేశావో ...అదే ప్రజాబ్యాలెట్ తో ప్రజలు మీపై తిరగబడతారని అంటే మా అధినేతపై ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేస్తారా అంటూ తమ్మినేని చంద్రబాబుపై మడిపడ్డారు. 

బాబుకు ఓటమి భయం పట్టుకుంది కాబట్టే, వైయస్సార్సీపీకి 30 సీట్లే వస్తాయని మాట్లాడుతున్నారని తమ్మినేని చురక అంటించారు.  నీ కోడలు బ్రహ్మణి నిర్వహించిన సర్వేలో  మీకు16 నుంచి 21 తప్ప ఒక్కటి కూడా ఏక్కువ రాదని చెప్పిన విషయం గుర్తులేదా బాబూ..వెళ్లి చదువుకోండి.  2019లో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది. వైయస్ జగన్ సీఎం అయి తీరుతారని తమ్మినేని దీమా వ్యక్తం చేశారు. ప్రజలు స్పష్టంగా వైయస్సార్సీపీవైపు ఉన్నారని చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ సైతం  ఏపీలో ఈసారి వైయస్సార్సీపీకి 65 శాతం వస్తుందని చెప్పారని గుర్తు చేశారు. సర్వేలన్నీవైయస్సార్సీపీకి అనుకూలంగా ఉన్నాయన్నారు.  నంద్యాల ఉపఎన్నికల్లో అవినీతి,  అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడుతున్న టీడీపీపై తగిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్, గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరపాలని కోరారు. అవసరమైతే కేంద్ర బలగాలను తీసుకు రావాలన్నారు.  ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యాన్ని ఏవిధంగా నవ్వుల పాలు జేస్తున్నారో, ఎన్నికలను ఎంత అపహాస్యం చేస్తున్నారో ఇక్కడి దురాగతాల్ని మీడియా ఎండగట్టాలని విన్నవించారు. 
Back to Top