శ్రీదేవి ఆద‌ర్శం

 

 
 తిరుమల : నటి శ్రీదేవి మరణం సినీ లోకానికి తీరని లోటని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. శ్రీవారిని దర్శించుకునేందుకు రోజా తన కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం తిరుమలకు చేరుకున్నారు. ఏడుకొండలవాడిని దర్శించుకున్న తర్వాత ఆమె విలేకరులతో మాట్లాడుతూ... శ్రీదేవిని ఆదర్శంగా తీసుకుని అనేకమంది సినిమాల్లో నటించటానికి వచ్చారని, అందులో తానూ ఒకరినని చెప్పారు. ఆమె ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Back to Top