బాధిత కుటుంబాల‌ను బాబు ఆదుకోవాలి

ప్ర‌కాశంః

రాష్ట్రాన్ని విష జ్వ‌రాలు వ‌ణికిస్తుంటే చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యులు వైవీ సుబ్బారెడ్డి ధ్వ‌జ‌మెత్తారు. ఒంగోలు రిమ్స్ ఆసుప‌త్రిని వైవీ సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆసుప‌త్రిలోని రోగుల‌ను ప‌రామ‌ర్శించి వైద్య సేవ‌ల వివ‌రాలున డాక్ట‌ర్ల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. శానిటేష‌న్ స‌రిగ్గా లేక‌పోవ‌డంతోనే వ్యాధులు ప్ర‌బ‌లుతున్నాయ‌న్నారు. డెంగీ వ్యాధుల‌తో మృతి చెందిన కుటుంబాల‌ను చంద్ర‌బాబు స‌ర్కార్ ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఆసుప‌త్రుల్లో ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్య సేవ‌ల‌ను అందించేలా దృష్టి సారించాల‌ని సూచించారు.

Back to Top