చంద్రబాబు నీచ రాజ‌కీయాలు

  • వైయస్సార్ విగ్రహ కూల్చివేత అమానుష చర్య
  • టీడీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
  • ప్రజల హృదయాల్లోంచి వైయస్సార్ ను తొలగించలేరు
  • వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు

ప్రజల గుండెల్లో కొలువైన దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను చూసి చంద్రబాబు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అర్థరాత్రి వైయస్సార్ విగ్రహాన్ని తొలగించి పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. విజయవాడలో ప్రియతమ నేత వైయస్సార్ విగ్రహాన్ని తొలగించడంపై వైయస్సార్సీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. వైయస్సార్సీపీ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు.  వైయస్సార్ విగ్రహాన్ని పునరుద్ధరించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చంద్రబాబును హెచ్చరించారు. 

మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్ర‌హాన్ని తొల‌గించ‌డంపై వైయస్సార్సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. వైయస్సార్సీపీపై టీడీపీ కక్షసాధింపుకు పాల్పడుతోందని ఫైర్ అయ్యారు. వైయ‌స్ జ‌గ‌న్ ను నేరుగా ఎదుర్కొలేక‌నే చంద్ర‌బాబు ఇలాంటి కుట్ర‌ల‌ు పన్నుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజల్లో మహానేత వైయస్సార్ కు  ఉన్న విశ్వాసాన్ని చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని  వైయస్సార్సీపీ నేత జోగిరమేష్ అన్నారు. అధికార బలంతో ప్రజా నేతల విగ్రహాలను తొలగిస్తే... చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. వైయస్సార్ విగ్రహం పట్ల చేసిన అపచారానికి తగిన మూల్యం చెల్లించుకుంటారని చంద్రబాబును జోగి రమేష్  హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. విగ్రహాలు కూల్చినంత మాత్రాన ప్రజల హృదయాల్లో నుంచి వైయస్సార్ ను తొలగించలేరని రోజా వ్యాఖ్యానించారు. 

చంద్రబాబుపై వైయస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా నిప్పులు చెరిగారు. ప్రజల గుండెల్లో వైయస్సార్ కొలువై ఉన్నందునే బాబు ఈర్శ్యతో విగ్రహాలను తొలగించే దుశ్చర్యకు తెరలేపారని మండిపడ్డారు.  విగ్ర‌హాల‌ను తొల‌గించాలంటే ముందు విగ్ర‌హా క‌మిటీ, సంబంధిత పార్టీతో మాట్ల‌డిన అనంత‌రం విగ్ర‌హాన్ని తొల‌గించాలన్నారు. అలాంటివేమీ లేకుండా అర్థ‌రాత్రి దొంగ‌లా వ‌చ్చి విగ్ర‌హాల‌ను తొల‌గించడం సిగ్గుమాలిన చ‌ర్య‌గా అభివర్ణించారు. వారు చేసే ప‌ని త‌ప్పుడు ప‌ని కాబ‌ట్టే ఇలా అర్థ‌రాత్రి పూట దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నార‌ని టీడీపీపై ధ్వజమెత్తారు. 

మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం కూల్చివేత అమానుష చర్య అని  కొలనుకొండ శివాజీ అన్నారు. ఈ చర్య టీడీపీ నీచ రాజకీయాలకు  నిదర్శనమ‌న్నారు. ప్రజలు మెచ్చిన మహానేత వైయ‌స్సార్ విగ్రహాన్ని తొలగించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు అరాచక పాలనకు చరమగీతం పాడే రోజు దగ్గర్లోనే ఉందని శివాజీ వెల్లడించారు. 
Back to Top