ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుణపాఠం తప్పదు

కొత్తూరు: చంద్రబాబు అవినీతి సొమ్ముకు అమ్ముడుపోయిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుణపాఠం తప్పదని వైయస్‌ఆర్‌సీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డిశాంతి హెచ్చరించారు. వసపలో శుక్రవారం ఆమె గడప గడపకూ వైయస్‌ఆర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  గ్రామస్తులు తమ సమస్యలను రెడ్డి శాంతి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో ఏ ఒక్కరికి కూడా పక్కా గృహాలు మంజూరు చేయలేదని మండిపడ్డారు. అర్హులకు పింఛన్లు, రేషన్‌ అందడం లేదని ధ్వజమెత్తారు.  పింఛ‌న్‌,  అభివృద్ధి చెస్తాడని గెలిపించిన ఎమ్మెల్యే వెంకట రమణ స్వార్థం కోసం టీడీపీలో చేరి ఏమి పట్టన ట్లుగా ఉన్నారని విమర్శించారు. 

Back to Top