ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలి

–ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు
–శాసనసభలో అరె, నిలువునా పాతేస్తా అన్న వారి పై చర్యలు ఏవి?
–విలేఖర్ల సమావేశంలో టీడీపీ నేతల పై మండిపడ్డ వైయస్సార్‌ సీపీ నేతలు

సత్తెనపల్లి ( గుంటూరు) :  తెలుగుదేశం పార్టీకి, నాయకులకు నైతిక విలువలు అనేవి ఏమైనా ఉంటే పార్టీ ఫిరాయించిన 20 మంది ఎమ్మెల్యేలు, నలుగురు మంత్రులతో రాజీనామా చేయించి తమ నైతికతను చాటుకోవాలని వైయస్సార్‌ సీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. నంద్యాలలో జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విమర్శలపై ప్రేలాపనలు చేస్తున్న టీడీపీ నేతల వ్యాఖ్యలను శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఖండించారు.   చేసిన వాగ్ధానాలు ఎందుకు అమలు పరచలేదని చంద్రబాబును నడిరోడ్డుపై నిలదీయాలని నంద్యాల ప్రజలకు చెప్పిన విషయాలను రక రకాలుగా ప్రకటనలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.  మంత్రులు, ఎంపీలు, చంద్రబాబు చేసిన వాగ్ధానాల అమలు గురించి ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే బోండా ఉమ ... వైఎస్సార్‌సీపీ శాసనసభ్యులను ఉద్దేశించి అరే, అరే, నా... అని, మంత్రి అచ్చెన్ననాయుడు నిలువునా పాతేస్తా అని నిండు సభలో సంభోదిస్తే అదే సభలో ఉన్న చంద్రబాబు ఏం సమాధానం చెప్పారో, వారిపై ఏం చర్యలు తీసుకున్నారో రాష్ట్ర ప్రజలందరూ వీక్షించారన్నారు. ఇటువంటి సంప్రదాయాలు కలిగిన టీడీపీ నాయకులు నంద్యాల ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాల గురించి మాట్లాడకుండా అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్న విధానాన్ని నంద్యాల ఓటర్లు గమనిస్తున్నారన్నారు.  నంద్యాలలో వైఎస్సార్‌ సీపీకి రోజురోజుకు వస్తున్న ప్రజాదరరణకు తట్టుకోలేక మతిభ్రమించి టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండి పడ్డారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్‌ నాగూర్‌మీరాన్, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ చల్లంచర్ల సాంబశివరావు, పార్టీ నాయకులు కళ్ళం వీరభాస్కర్‌రెడ్డి, కోడిరెక్క దేవదాస్, అచ్యుత శివప్రసాద్, బలిజేపల్లి సురేష్‌కుమార్, ఎస్‌.ఎమ్‌. యూనస్, ఆకుల హనుమంతరావు, పేరుపోగు సుగుణ, ఇసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, షేక్‌ మౌలాలి, గూడా శ్రీనివాసరెడ్డి, కొత్తా భాస్కర్, వరికల్లు రామయ్య, దుగ్గి భద్రయ్య, శిరిగిరి వెంకట్రావు, వల్లెం నరసింహారావు, కలి, మస్తాన్, పీసపాటి రమణ్‌రాయ్, ఇన్నారెడ్డి, జెమిలి రాధా, తదితరులు ఉన్నారు.
Back to Top