ఫిరాయింపులు సీరియ‌స్ స‌మస్య‌

న్యూఢిల్లీ :  ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మంలో భాగంగా ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత‌, వైఎస్సార్సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మ‌రియు పార్టీ నేత‌ల బృందం సీపీఐ జాతీయ ఉప ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజా ను క‌లిశారు. అవినీతి సొమ్ముల‌తో చంద్ర‌బాబు చేస్తున్న అరాచ‌కాలు, అడ్డ‌గోలుగా ఎమ్మెల్యేల‌ను కొనుగోలు చేయ‌టం వంటి అంశాల్ని వివ‌రించారు. పార్టీ ప్ర‌చురించిన చంద్ర‌బాబు..ఎంప‌ర‌ర్ ఆఫ్ క‌ర‌ప్ష‌న్ అనే పుస్త‌కాన్ని అందించారు. అందులోని వివ‌రాల్ని రాజా ఆసక్తిగా తిల‌కించారు. అందులోని వివ‌రాల్ని అడిగి తెలుసుకొన్నారు. భేటీ అనంతరం డి.రాజా మాట్లాడుతూ వైఎస్ జగన్ తమ దృష్టికి తీసుకువచ్చిన అంశాలను పార్టీలో చర్చిస్తామన్నారు. ఫిరాయింపుల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుంటామన్నారు. పార్టీ మారిన వ్యక్తులు  ఆ పార్టీ నుంచి వచ్చిన అన్ని పదవుల నుంచి తప్పుకోవాలన్నారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకోవడం సరికాదని డి.రాజా వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు అవినీతి ప‌రంప‌ర కు సంబంధించిన వివ‌రాల్ని రాజా శ్ర‌ద్ధ‌గా ప‌రిశీలించారు. ఈ భేటీలో మ‌రికొంద‌రు వామ‌పక్ష సీనియ‌ర్ నేత‌లు పాల్గొన్నారు. 
Back to Top