అధికార పార్టీకి భంగపాటు

* పోటాపోటీ ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి విజయం
* ఎ.తంబళ్లపల్లె ఉప సర్పంచ్‌గా అబంటి వీరారెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా(కలసపాడు): అధికార టీడీపీ నేతల వెన్నులో వణుకు మొదలైంది. మాయ మాటలు చెప్పి ఎన్నికల్లో గెలుపొందిన పచ్చ తమ్ముళ్లకు కౌంట్‌ డౌన్‌ మొదలైంది. వైయస్‌ఆర్‌ జిల్లా బద్వేల్ నియోజకవర్గం కలసపాడు మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఎగువ తంబళ్లపల్లె పంచా యతీ ఉపసర్పంచ్‌ ఎన్నికల్లో అధికార పార్టీకి భంగపాటు జరిగింది. ఈ ఎన్నికల్లో అనూహ్యరీతిలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారుడు అంబటి చిన్నవీరారెడ్డి ఒక ఓటుతో గెలుపొందారు. మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎగువ తంబళ్లపల్లె పంచాయతీలో కాంగ్రెస్‌ పార్టీ మద్దతు దారుడుగా పోటీ చేసిన మస్తాన్‌బాష సర్పంచ్‌గా ఎన్నికైయ్యారు.ఆ తరువాత ఉప సర్పంచ్‌ ఎన్నికను వాయిదా వేస్తూవచ్చారు. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ మద్దుతు దారుడిగా గెలుపొందిన  మస్తాన్‌బాష అధికార టీడీపీలో చేరిపోయారు. అప్పటి నుంచి ఏలాగైనా టీడీపీ మద్దతుదారుడినే ఉపసర్పంచ్‌గా గెలిపించుకోవాల ని ఎన్నికను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులు ఖచ్చితంగా ఉప సర్పంచ్‌ ఎన్నిక జరిపితీరాలని చెప్పడంతో శుక్ర వారం ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మద్దతు దారుడైన అబంటి చిన్నవీరారెడ్డి ఒక ఓటు మెజారిటీతో ఉప సర్పం చ్‌గా గెలుపొందారు. దీంతో అధికార పార్టీకి చుక్కెదురైంది. 

తాజా వీడియోలు

Back to Top