దీక్షాస్థలిలో వైఎస్ భారతి..!

గుంటూరుః ప్రత్యేకహోదా డిమాండ్ తో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ఆయన సతీమణి భారతి పరామర్శించారు. ఇవాళ గుంటూరు నల్లపాడు రోడ్డులోని దీక్షా స్థలికి చేరుకొని వైఎస్ జగన్ ను కలుసుకున్నారు. జగన్ ఆరోగ్యం క్షీణిస్తుండడంతో భారతి ఆందోళన చెందుతున్నారు. వెన్నంటే కూర్చొని ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ ను అడిగి తెలుసుకున్నారు. 

జగన్ బరువు తగ్గి బాగా నీరసించడంతో శరీరంలో చక్కెర నిల్వలు, పల్స్ రేట్ బాగా పడిపోయాయి. కీటోన్ లెవల్స్ పెరిగిపోతున్నాయి. ఐనా సరే హోదా వచ్చే దాకా దీక్ష ఆగదని వైఎస్ జగన్ స్పష్టం చేస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వైఎస్ జగన్ కు తమ సంఘీభావం ప్రకటిస్తూనే ఉన్నారు.

తాజా ఫోటోలు

Back to Top