దీక్ష భగ్నంపై వైఎస్సార్సీపీ ఆందోళన బాట..!

గుంటూరుః వైఎస్ జగన్ దీక్ష భగ్నాం చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. చీకట్లో పోలీసులను పంపించి చంద్రబాబు వైఎస్ జగన్ దీక్షపై కుట్ర చేయడం పట్ల వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. వైఎస్ జగన్ ను  బలవంతంగా  ఆస్పత్రికి తరలించి ఫ్లూయిడ్స్ ఎక్కించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

చంద్రబాబు వైఖరికి నిరసనగా అనంతపురం జిల్లా  రాయదుర్గం ఆర్టీసీ డిపో ముందు వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఉదయమే డిపో వద్దకు చేరుకుని బస్సులు బయటికి రాకుండా అడ్డుకున్నారు. ధర్నాను అడ్డుకున్న పోలీసులు నేతలను అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. దీంతో, అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. 

పులివెందుల బస్టాండ్ వద్ద మాజీ మంత్రి, వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అదేవిధంగా జిల్లాలోని పోరుమామిళ్లలో ఆ పార్టీ నాయకుడు విజయప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు పాల్గొన్నారు.  

తాజా వీడియోలు

Back to Top