దీక్ష విర‌మించేది లేదు

- ఎంపీలు వైయ‌స్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి
- గంట గంట‌కు ఆందోళ‌న‌క‌రంగా ఎంపీల ఆరోగ్యం
గుంటూరు: ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు ప్రాణ‌త్యాగాల‌కు సిద్ధ‌మ‌య్యారు. ఆరో రోజులుగా ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తున్న  పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వైయ‌స్‌ అవినాష్‌రెడ్డిల ఆరోగ్యం క్షీణిస్తోంది. షుగర్‌ లెవెల్స్‌ పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఆర్‌ఎంఎల్‌ వైద్యులు ఎంపీల‌కు వైద్య పరీక్షలు జరిపి దీక్షలు విరమించాలని వారిని కోరారు. అయితే వారు దీక్ష విర‌మించేది లేద‌ని, పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పోరాటాలే స్ఫూర్తిగా ఉద్య‌మిస్తామ‌ని ఖ‌రాఖండిగా చెబుతున్నారు.  కాగా, వీరిద్ద రూ ఇçప్పటికే డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నా రని.. షుగర్‌ లెవెల్స్‌ అంతకంతకూ పడిపోతు న్నాయని, ఇంకా దీక్ష కొనసాగిస్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిన్న‌టికే అవినాష్‌రెడ్డి బీపీ 110/70, షుగర్‌ లెవెల్స్‌ 74, పల్స్‌రేటు 76కు పడిపోయాయి. మిథున్‌రెడ్డి బీపీ 106/70, షుగర్‌ లెవెల్స్‌ 78, పల్స్‌రేట్‌ 86కు పడిపోయాయి. గంట గంట‌కు ఎంపీల ఆరోగ్యం విష‌మంగా మార‌డంతో దీక్షా శిబిరంలో ఉత్క‌ఠ నెల‌కొంది.
Back to Top