క్షీణించిన శ్రీకాంత్, రవీంద్రనాథ్‌రెడ్డిల ఆరోగ్యం

కడప :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్నిఅడ్డగోలుగా విడగొట్టవద్దంటూ వైయస్ఆర్ జిల్లా కడపలో ‌పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనా‌థ్‌రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షలు శుక్రవారం నాటికి ఐదు రోజులు పూర్తిచేసుకుని, శనివారం ఆరవ రోజుకు చేరుకున్నాయి. వారి ఆరోగ్యం రోజురోజుకూ బాగా క్షీణిస్తోంది. అయినా లెక్కచేయకుండా శ్రీకాంత్‌రెడ్డి, రవీంద్రనా‌థ్‌రెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు. ఈ దీక్షా శిబిరం వద్దకు వైయస్ఆర్‌ జిల్లా నలుమూలల నుంచీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, రైల్వేకోడూరులో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు చేస్తున్న ఆమరణ దీక్షలు శుక్రవారానికి రెండు రోజులు పూర్తయ్యాయి. వీరి దీక్షలకు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు వైయస్ అవినా‌ష్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top