ప్యాకేజీ పేరుతో మోసం

కర్నూలుః ప్రతీ ఒక్కరి మొహంలో చిరునవ్వు చూడాలన్నదే వైయస్ జగన్ కోరికని, అయితే అది ప్రత్యేకహోదాతోనే సాధ్యమని న్యాయవాది శంకరయ్య పేర్కొన్నారు. ప్రత్యేక హోదాను మ్యానిఫెస్టోలో పెట్టుకున్న టీడీపీ, బీజేపీలు ప్రజలను ప్రత్యేక నాటకంతో ప్యాకేజీ పేరుతో మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉత్తరాఖండ్, హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రత్యేక హోదాతో లాభపడిన సంగతి ఆ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు.  ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినదించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. చంద్రబాబు భ్రమల్లో నుంచి బయటకు రావాలన్నారు. చట్టాల పేరు చెప్పి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకోవడం తగదని బాబుకు హితవు పలికారు. 


Back to Top