వైయస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు

 

కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వైద్య విభాగం  రాష్ట్ర అధ్యక్షుడు శివభరత్‌రెడ్డి తెలిపారు. డిసెంబర్‌ 21న వైయస్‌ జగన్‌ జన్మదినం సందర్భంగా వైయస్‌ఆర్‌సీపీ వైద్య విభాగం, ఎన్‌ఆర్‌ఐ వైద్య విభాగం, ఎన్‌ఆర్‌ఐ విభాగం, స్థానిక పార్టీ కమిటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. డిసెంబర్‌ 19న కర్నూలులో, 20న పుట్టపర్తిలో, 21న విజయవాడలో మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పది విభాగాలకు చెందిన వైద్యులు పేదలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. చిన్న చిన్న శస్త్ర చికిత్సలు సైతం చేయించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే దివ్యాంగులకు ఉచితంగా ట్రై సైకిళ్లను కూడా పంపిణీ చేయనున్నట్లు శివభరత్‌రెడ్డి వెల్లడించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు, అన్నదానం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు.
 
Back to Top