మైనారిటీల సంక్షేమంపై వైఎస్సార్సీపీ చర్చకు పట్టు

మైనార్టీ సంక్షేమంపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు.  మైనారిటీలపై చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష సభ్యులు ఎండగట్టారు. ఐతే,  ప్రతిపక్షం గొంతు నొక్కేలా స్పీకర్ మైక్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ... ఎమ్మెల్యేలు  పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. దీంతో, సభ కాసేపు వాయిదా పడింది. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే, ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నందునే తాము అవిశ్వాసం పెట్టడం జరిగిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చెప్పారు.. 

Back to Top