సూరబత్తుని ఆకాల మృతి బాధాకరం

శావల్యాపురంః మండలంలోని వేల్పూరు గ్రామానికి చెందిన సూరబత్తుని నాగేశ్వరరావు ఆకాల మృతి భాదాకరమని వినుకొండ నియోజకవర్గ వైయస్సార్‌ సీపీ ఇన్‌చార్జ్‌ బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. మంగళవారం మండలంలోని వేల్పూరు గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన మాజీ సోసైటి అధ్యక్షులు సూరబత్తుని నాగేశ్వరరావు (54) మృతదేహాన్ని ఆయన పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢా సానుభూతి వ్యక్తం చేశారు.మంచి వ్యక్తిని కోల్పోవటం బాధకరమన్నారు.సంతాపం వ్యక్తం చేసిన వారిలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వైయస్సార్‌సీపీ నాయకులు స్వర్ణాల వెంకటరావు ముండ్రు రాఘవరావు సాదినేని వెంకయ్య పారా ఏడుకొండలు ముండ్రు సాంబశివరావు తదితరులు ఉన్నారు.

Back to Top