బాబును జనం రాళ్ళతో కొట్టే రోజు వస్తుంది: జగన్


గుంటూరు, జూలై 31: జనాన్ని నిలువునా దగా చేస్తున్న చంద్రబాబును రాబోయే రోజుల్లో అదే జనం రాళ్ళతో కొట్టే పరిస్థితి వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు మాటలు నమ్మిన రైతులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని శ్రీ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక వైపు రుణాలు తిరిగి చెల్లించాల్సి గడువు ముగియడంతో లక్ష రూపాయలపై ఏకంగా 13 వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాల్సిన పరిస్థితి దాపురించిందని, మరోవైపు ఖరీఫ్ వ్యవసాయానికి కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రైతులతో పాటు డ్వాక్రా మహిళలపైనా ఇంతే మొత్తంలో భారం పడుతోంది. వారు పైసా పైసా చొప్పున పొదుపు చేసుకున్న సొమ్మును సైతం చంద్రబాబు మోసపూరిత వైఖరి ఫలితంగా బ్యాంకులు బకాయిల కింద తీసుకుంటున్నాయని శ్రీ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ రకంగా చంద్రబాబు సర్కారు చెబుతున్న అబద్దాలు, చేస్తున్న మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని, ప్రజల తరఫున ఉద్యమించాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు. గుంటూరు లోక్ సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ నేతలు, కార్యకర్తలతో శ్రీ జగన్ మోహన్ రెడ్డి గురువారం గుంటూరు అమరావతి రోడ్డులోని బండ్లమూడి గార్డెన్స లో సమావేశమై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు అవసరమైన సూచనలు, సలహాలు అన్నీ పాటిస్తామని...కానీ అధికార కాంక్షతో చంద్రబాబులా అబద్దాలు మాత్రం ఆడనని స్పష్టం చేశారు.

Back to Top