అదే అభిమానం.. అదే ఆత్మీయ‌త‌..!

వ‌రంగ‌ల్: వైఎస్సార్ సీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల వ‌రంగ‌ల్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు అపూర్వ ఆద‌ర‌ణ క‌నిపిస్తోంది. ఆమె ప‌ర్య‌ట‌న‌లో స్థానికులు అడుగ‌డుగునా పాలు పంచుకొంటున్నారు. అదే అభిమానాన్ని, ఆప్యాయ‌త‌ను కురిపిస్తున్నారు. 

వ‌రంగ‌ల్ జిల్లాలో మ‌లి విడ‌త ప‌రామ‌ర్శ యాత్రలో వైఎస్ ష‌ర్మిల చురుగ్గా ప‌ర్య‌టిస్తున్నారు. దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణంతో దిగులు చెంది ప్రాణాలు వ‌ద‌లిన వారిని ప‌రామ‌ర్శించ‌టం త‌మ బాధ్య‌త‌గా వైఎస్ జ‌గ‌న్ బావించారు. ఈ మేర‌కు ఆయ‌న బ‌హిరంగ ప్ర‌క‌ట‌న చేశారు. మాట మేర‌కు అనేక జిల్లాల్లో ప‌ర్య‌టించి ఆత్మీయంగా ప‌రామ‌ర్శించారు. త‌ర్వాత ఆయన మాట‌ను  నిల‌బెడుతూ వైఎస్ జ‌గ‌న్ సోద‌రి వైఎస్ ష‌ర్మిల ప‌రామ‌ర్శ యాత్ర చేప‌ట్టారు.

ఇప్ప‌టికే న‌ల్ల‌గొండ‌, రంగారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాల్లో ప‌ర్య‌టించిన వైఎస్ ష‌ర్మిల తాజాగా వ‌రంగ‌ల్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. మొద‌టి విడత ప‌రామ‌ర్శ యాత్ర ను పూర్తి చేసిన వైఎస్ ష‌ర్మిల రెండో విడ‌త ప‌రామ‌ర్శ యాత్ర‌ను ప్రారంభించారు. రెండో విడ‌త ప‌రామ‌ర్శ యాత్ర రెండో రోజున మ‌హ‌బూబా బాద్ నియోజ‌క వ‌ర్గంలో ప‌ర్య‌టించి ఏడు కుటుంబాల్ని ప‌ల‌క‌రించారు.  చ‌నిపోయిన వారి కుటుంబ స‌భ్యుల్ని అడుగ‌డుగునా ప‌ల‌క‌రిస్తూ ఆత్మీయ‌త‌ను పంచారు. 
Back to Top