'సాగర్ నీరు విడుదలలో అన్యాయం'

ఒంగోలు: సాగర్ నీటి విడుదలలో ఒంగోలు  జిల్లాకు చెందిన రైతులకు అన్యాయం జరుగుతోందని యర్రగొండపాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక రెవెన్యూ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  సాగర్ జలాలను పూర్తిస్థాయిలో విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కోరారు. అధికార పార్టీకి చెందిన నాయకుల నిర్లక్ష్యానికి సాగర్‌జలాలు అర్దంతరంగా నిలిచిపోయాయన్నారు. జిల్లాకు విడుదల కావలసిన నీటివాటాను పూర్తిగా విడుదల చేయడం లేదని ఆయన అన్నారు. గతంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలతో పాటు జిల్లాకు చెందిన మంత్రి, ఎన్‌ఎస్‌పీ అధికారులు కాలువపై పర్యటించి నీటి విడుదల తీరును సమీక్షించేవారన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేనందున రైతులు అవస్థలు పడుతున్నారని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దపోతు చంద్రమౌళిరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ కోట్ల సుబ్బారెడ్డి, వీరభద్రాపురం కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు అద్దంకి శ్రీరాములు, నాయకులు ఎస్. పోలిరెడ్డి, ఆళ్ల కృష్ణారెడ్డి, వజ్రాల కోటిరెడ్డి, దగ్గుల గోపాలరెడ్డి పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top