దశ, దిశ జగన్‌తోనే సాధ్యం: దాడి

హైదరాబాద్, 04 మే 2013:

పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గారి సమక్షంలో శనివారం సాయంత్రం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి సభ్యత్వాన్ని స్వీకరించామని దాడి వీరభద్రరావు చెప్పారు. లోటస్ పాండ్ నివాసంలో ఆమెను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రానికి దశ, దిశ జగన్ వల్లే సాధ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిపాలన అధ్వానంగా ఉందన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొందన్నారు. ఇలాంటి పరిస్థితిలో వైయస్ఆర్ కాంగ్రెస్‌పై ప్రధాన బాధ్యత ఉందన్నారు. సీట్లు, అధికారం తమకు ముఖ్యం కాదన్నారు. వైయస్ఆర్ కుటుంబానికి అండగా ఉండాలనే పార్టీలో చేరానని వివరించారు.ఎన్టీరామారావు తర్వాత ప్రజా సంక్షేమం పట్టించుకున్న వ్యక్తి వైయస్ఆర్ మాత్రమేనని పేర్కొన్నారు.

కొణతాలతో తమకు రాజకీయ వైరుద్ధ్యాలే తప్ప వ్యక్తిగత విభేదాలు లేవన్నారు. త్వరలోనే అవన్నీ సమసిపోతాయని దాడి చెప్పారు.

దాడి చేరిక పట్ల పాయకరావుపేట ఎమ్మెల్యే, విశాఖ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ కన్వీనర్ గొల్ల బాబూరావు హర్షం వ్యక్తంచేశారు. ఆయన చేరికతో పార్టీ బలోపేతమైందనీ, ఉత్తరాంధ్రలో అన్ని స్థానాలనూ క్లీన్ స్వేప్ చేస్తామనీ చెప్పారు.

Back to Top