అసెంబ్లీ లో దుర్దినం

హైదరాబాద్)
శాసనసభలో ఇవాళ జరిగింది ఒక దుర్దినం అని వైఎస్సార్సీపీ సీనియర్ శాసనసభ్యుడు గడికోట
శ్రీకాంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు. స్వయంగా స్పీకర్ స్థానంలో ఉన్న కోడెల
శివప్రసాద్ రావు ప్రవర్తించిన తీరు బాధాకరం అని వ్యాఖ్యానించారు. పార్టీ
ఫిరాయించిన 8 మందికి ఎక్కడ విప్ వర్తిస్తుందో అన్న భయంతో మూజువానీ ఓటుతో
గట్టెక్కించారు అని ఆరోపించారు. శాసనసభ వ్యవహారాలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యేలతో
కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.

స్పీకర్ మీద
అవిశ్వాసం

       వాస్తవానికి తమకు స్పీకర్ స్థానం అంటే
గౌరవం అని, కానీ స్పీకర్ గా కోడెల ప్రవర్తించిన తీరు మాత్రం బాధ కలిగించిందని
వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత గా వైఎస్ జగన్ 1,2 నిముషాలు మాట్లాడితే 30, 40
నిముషాలు తిట్టించటమే పనిగా పెట్టుకొన్నారు. స్పీకర్ ప్రవర్తనలో మార్పు వస్తుంది
అని ఇప్పటిదాకా వేచి చూశాం అని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు. అందుచేత స్పీకర్ మీద
అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకొన్నాం. ముఖ్యమంత్రి మాత్రం చాలా
విషయాలు చెబుతుంటారని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అన్నా హజారే, గాంధీ
తర్వాత తానే అని చెబుతారు. రికార్డులు చూపించినా ఒప్పుకోం అని అంటుంటారు. సీబీఐ
విచారణ వస్తే ప్రగతి ఆగుతుంది అని ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి
పేర్కొన్నారు. స్పీకర్ స్థానం మీద గౌరవం ఉన్నా, కోడెల ప్రవర్తనతో విసిగి అవిశ్వాసం
తేవాలనుకొంటున్నట్లు శ్రీకాంత్ రెడ్డి వివరించారు.

     గుడ్డి
ప్రభుత్వ పాలన

శాసనసభలో
జరుగుతున్న ప్రవర్తన గుడ్డి ప్రభుత్వాన్ని తలపిస్తోందని వైఎస్సార్సీపీ సభ్యుడు
రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
ను అగౌరవ పరిచేందుకు పదే పదే ప్రయత్నాలు జరిగాయని ఆయన అన్నారు. మొన్నటి రోజున తాము
సభలో లేమని, అయినప్పటికీ తమను సభ నుంచి సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. ఇది గుడ్డి
ప్రభుత్వం అని ఆయన వ్యాఖ్యానించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలను కాపాడుకొనేందుకే
మూజువాణీ ఓటుతో గట్టెక్కారని పేర్కొన్నారు. సాంప్రదాయం ప్రకారం సభ జరగటం లేదని చెప్పారు. 

Back to Top