ద‌మ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించండి

విజ‌య‌వాడ‌:  తెలుగు దేశం పార్టీ నేత‌ల‌కు  దమ్ము, దైర్యం, నైతిక విలువలు ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయించాలని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి కె. పార్థ‌సార‌ధి సవాల్‌ విసిరారు. ఉప ఎన్నిక‌లో టీడీపీకి ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంద‌ని, అందుకే నంద్యాల‌కు రూ.1200 కోట్ల అభివృద్ధి ప‌నులు ప్ర‌క‌టించార‌ని విమ‌ర్శించారు. వైయ‌స్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ‌స్తున్న ఆద‌ర‌ణ చూసి జీర్ణించుకోలేక 
 టీడీపీ నేతలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారని  మండిప‌డ్డారు. సభ్యతా, సంస్కారం గురించి  మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.  
Back to Top