దళితులంటే కిరణ్‌ ప్రభుత్వానికి కపట ప్రేమ

విశాఖపట్నం, 3 ఫిబ్రవరి 2013:‌ రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల పట్ల కపట ప్రేమ ప్రదర్శిస్తున్నదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు వ్యాఖ్యానించారు. సహకార సంఘాల ఎన్నికల్లో ఈనాటికీ రిజర్వేషన్ల విధానాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభించకపోవడం దురదృష్టకరం‌ అని బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు. సహకార రంగంలో స్వామినాథన్ సిఫారసులను ‌ముందుగా అమలు చేసింది దివంగత మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి అని గొల్ల బాబురావు గుర్తంచేశారు.
Back to Top