దళితులకు ఎక్కువ మేలు చేసిన వైయస్

హైదరాబా‌ద్ :

మహానేత డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి ‌అమలు చేసిన సంక్షేమ పథకాలు ఎక్కువగా దళితులకు లబ్ధి చేకూర్చాయని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకా‌శ్ ‌పేర్కొన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఎస్సీ విభాగం కార్యవర్గం, జిల్లా కన్వీనర్ల సమావేశంలో నల్లా మాట్లాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్సుమెంట్ పథకం, సబ్సిడీ బియ్యం, ఉచిత విద్యుత్, వికలాంగా, వృద్ధాప్య, వితంతు పెన్ష‌న్లు, గృహ నిర్మాణం తదితర పథకాలతో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న దళితులే ఎక్కువగా లబ్ధి పొందారన్నారు.

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని దళితులంతా వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీకి మద్దతుగా ఉండేలా కృషిచేయాలని పార్టీ కార్యకర్తలను సూర్యప్రకాశ్ ‌విజ్ఞప్తి చేశారు. జనవరి 15వ తేదీలోగా ఎస్సీ విభాగం జిల్లా, మండల కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. జనవరి 5న విజయనగరంలో భారీ బహిరంగ సభను, 6న విశాఖపట్నంలో కార్యకర్తల సమావేశం నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Back to Top