వైయ‌స్ జ‌గ‌న్ ను క‌లిసిన ద‌ళితులు

సిద్ద‌గూరిప‌ల్లి) ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్సార్సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ ను అనంత‌పురం జిల్లా సిద్ద‌గూరి ప‌ల్లి గ్రామ ద‌ళితులు క‌లిశారు. వైయ‌స్ జ‌గ‌న్ పులివెందుల పర్య‌ట‌న‌కు వెళుతుండ‌గా మార్గ‌మ‌ధ్య‌లో గ్రామ‌స్తులు క‌లిశారు. త‌మ స‌మస్య‌ల్ని వెళ్ల‌బోసుకొన్నారు. గ‌తంలో త‌మ కాల‌నీల‌కు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా ప‌థ‌కం కింద క‌రెంటు ఇచ్చేవార‌ని, చంద్ర‌బాబు నాయుడు ప్ర‌భుత్వం వ‌చ్చాక మీట‌ర్లు పెట్టుకోవాల‌ని, ఇత‌ర కార‌ణాలు చూపించి విద్యుత్ స‌ర‌ఫ‌రా నిలిపివేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీని పై ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్‌జ‌గ‌న్ స్పందించారు. అధికారుల‌తో మాట్లాడి స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు. 
Back to Top