దళితజాతి చంద్రబాబును క్షమించదు

పొన్నలూరు: నిత్యం దళితులను, వారి జీవన విధానాలను అవమానపరుస్తున్న చంద్రబాబు, టీడీపీ మంత్రులను యావత్‌ దళితజాతి క్షమించదని మండల వైయస్సార్‌సీపీ ఎస్సీసెల్‌ కన్వీనర్‌ గోచిపాత రామయ్య అన్నారు.దళితులను కించపరుస్తూ మాట్లాడిన రాష్ట్ర మంత్రి ఆదినారాయణరెడ్డి వాఖ్యలను ఖండిస్తూ గురువారం విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదినారాయణరెడ్డి బాధ్యత గల మంత్రి స్థానంలో ఉండి దళితులు శుభ్రంగా ఉండరు,సరిగా చదువుకోరు,వీరికి రిజర్వేషన్లు కొనసాగించడం అనవసరమని మాట్లాడటం ఆయన అధికార దుహంకారానికి నిదర్శనమన్నారు.టీడీపీ ప్రభుత్వంలో దళితులకు రక్షణ లేదని దీనికి ఉదాహరణ ఇటీవల గరగపర్రు,దేవరపల్లి ఘటనలే సాక్ష్యమన్నారు.సమాజంలో వెనకబాటు తనాన్ని అనుభవిస్తూ ఇప్పుడిప్పుడే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూన్న దళితులను చిన్నచూపు చూడటం టీడీపీ మంత్రులకు తగదని మండల కన్వీనర్‌ పల్నాటి వెంకటేశ్వరరెడ్డి అన్నారు.రాజ్యాంగ,చట్టం ప్రకారం ఎస్సీ,ఎస్టీలకు దక్కాల్సిన హక్కులను చంద్రబాబు,వారి పార్టీనాయకులు తూట్లు పొడుస్తున్నారని దుయ్యబట్టారు.రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు దళితుల అభివృద్ధికి ఖర్చు చేయకుండా టీడీపీ ప్రభుత్వం రూ,3 వేల కోట్లు దారి మల్లించిందని మాజీ కన్వీనర్‌ బెజవాడ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.దళితల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వివక్షపూరితంగా మాట్లాడిన ఆదినారాయణరెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల ప్రచార కమిటీ అధ్యక్షలు శిరిగిరి గోపాల్‌రెడ్డి,మర్రిపూడి ఎస్సీసెల్‌ అధ్యక్షుడు సాల్మన్,పిల్లి తిరుపతిరెడ్డి,కె మాలకొండయ్య,నల్లూరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Back to Top