టీడీపీ పాలనలో దళితులకు అవమానం

పెనమలూరుః టీడీపీ పాలనలో దళితులకు తీరని అవమానాలు జరుగుతున్నామని వైయస్సార్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి వల్లే నరసింహారావు ఆరోపించారు. ఆయన మంగళవారం వివరాలు తెలుపుతూ గరగపర్రులు దళితులను సాంఘీక బహిష్కరణ చేయటం దారుణమన్నారు.సీఎం సొంత జిల్లా చిత్తూరులో కూడా దళితులను అవమాన పరిచారని ఆరోపించారు. చంద్రబాబు పాలనలో దళితులు అవమానాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వానికి దళితుల అభివృద్ది పై ఏమాత్రం చిత్తశుద్ది లేదని తెలిపారు.

Back to Top