దళితులను చులకనగా చూస్తున్న మంత్రి

గుంటూరు: వ‌్య‌వ‌సాయ శాఖ మంత్రి పుల్లారావు ద‌ళితులను చుల‌క‌న‌గా చూస్తున్నార‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. గుంటూరు జిల్లా ఎడ‌వ‌ల్లిలోని రైతుల భూములు టీడీపీ ప్ర‌భుత్వం లాక్కోవ‌డంపై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో నాగార్జున మాట్లాడుతూ... రైతుల భూములను అన్యాయంగా లాక్కుంటున్నార‌ని, రూ. 5వేల కోట్ల మైనింగ్ కోసం వంద‌లాది ద‌ళిత కుటుంబాల‌ను రోడ్డున ప‌డేస్తున్నార‌ని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్ర‌భుత్వం తానా అంటే అధికారులు తందానా అంటున్నార‌ని ఆయన ఫైర్ అయ్యారు. వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ద‌ళితుల‌కు ఎప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. రైతుల భూముల‌ను లాక్కోవ‌డంపై పార్టీ త‌ర‌ఫున పోరాడుతామ‌ని  స్ప‌ష్టం చేశారు.

Back to Top