దళిత ఎమ్మెల్యేపై డిప్యూటీ సీఎం ఆగ్రహం


కర్నూలు: ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలన్న దళిత ఎమ్మెల్యే ఐజయ్యపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కర్నూలు జిల్లా పరిషత్‌సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఐజయ్య పలు సూచనలు చేశారు. దీంతో జీర్ణించుకోలేకపోయిన కేఈ కృష్ణమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఈ తీరును ఎమ్మెల్యే ఐజయ్య తీవ్రంగా తప్పుపట్టారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తుంది వైయస్‌ఆర్‌సీపీనే అంటూ జెడ్పీ సమావేశాన్ని బహిష్కరించారు. 
 
Back to Top