దళితులకు తీవ్ర అన్యాయం

 
అనంతపురం: రాష్ట్రంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దాడులు విఫరీతంగా పెరిగాయని దళిత సంఘాల నాయకులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం దళిత, మైనారిటీ సంఘాల నాయకులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. దళితులకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో పని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పచ్చ చొక్కాలకే పథకాలు పరిమితమవుతున్నాయని తెలిపారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న చంద్రబాబు పాలనను చరమగీతం పాడేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారని దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. రాయలసీమను చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని, జిల్లాలో బతకలేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

వైయస్‌ హయాంలోనే మైనారిటీలకు మేలు
 దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలోనే మైనారిటీలకు మేలు జరిగిందని మైనారిటీ సంఘాల నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ రోజు మైనారిటీలు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారని సచార కమిటీ సభ్యులే చెప్పారన్నారు.  పిల్లలను చదవించుకునే స్థోమత లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం మైనారిటీలపై కపట ప్రేమ చూపుతుందన్నారు. రంగనాథ కమిటీ మైనారిటీలకు 10 శాతం రిజర్వేషన్లు అవసరమని అభిప్రాయపడ్డారని, దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చి న్యాయం చేశారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పారు. ఏ ఒక్కరికి ఉద్యోగం రాలేదని వారు వైయస్‌ జగన్‌కు వివరించారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు. మన ప్రభుత్వం రాగానే అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
 
Back to Top