ప్రజా సంకల్ప యాత్రకు ఐక్య దళిత మహానాడు మద్దతు


నెల్లూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. నెల్లూరులో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఐక్య దళిత మహానాడు నాయకులు కలిసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు హయాంలో జరుగుతున్న దాడులను వైయస్‌ జగన్‌కు వివరించారు. ఈ ప్రభుత్వంలో దళితులకు రక్షణకరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. వరుస ఘటనలతో దళితులు అభద్రతా భావంలో ఉన్నారని, మీరు ముఖ్యమంత్రి అయి దళితులకు తోడుగా ఉండాలని కోరారు. ఐక్యత, అభివృద్ధి, రక్షణే ధ్యేయంగా ఏర్పడిన ఐక్య దళిత మహానాడు వైయస్‌ఆర్‌సీపీ వెంట ఉంటుందని వారు పేర్కొన్నారు. దళిత సంఘాల నాయకులు చెప్పిన సమస్యలను సావధానంగా విన్న వైయస్‌ జగన్‌ వారికిభరోసా కల్పించారు. వైయస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాలు చాలా బాగున్నాయని దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
 
Back to Top