దళితనేత రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై హర్షం

రొద్దం: ఓసామాన్య దళిత వర్గానికి చెందిన రామ్‌నాథ్‌ గోవింద్‌ను రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వైయస్‌ఆర్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి చంద్రశేఖర్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీజేపీలో ఎందరో సీనియర్లు, మహావ్యక్తులు, మేధవులున్నా, ఎవరూ ఊహించని విధంగా ఓదళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిచడంపై సర్వత్రా హర్షం వ్యక్త మవుతున్నట్లు పేర్కొన్నారు. ఆయన ఎంపిక పట్ల ప్రధానమంత్రికి,జాతీయ అధ్యక్షుడు తమిత్‌షాకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వివరించారు. రాష్ట్రపతిగా దళిత అభ్యర్థి ప్రకటనపై తమ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

Back to Top