జై జగన్ నినాదాలతో హోరెత్తిన వేదిక

  • యువభేరి ప్రాంగణానికి చేరుకున్న వైయస్ జగన్
  • జననేతకు పార్టీశ్రేణులు, యువత ఘన స్వాగతం

నెల్లూరుః కస్తూరి దేవి గార్డెన్ కు యువత కదం తొక్కొంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత రాకతో యువభేరి వేదిక పోటెత్తింది. ఏపీ ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. వైయస్ జగన్ కు పార్టీ శ్రేణులు, యువకులు ఘన స్వాగతం పలికారు. జై జగన్ నినాదాలతో యువభేరి ప్రాంగణం మార్మోగింది. 

ప్రత్యేకహోదా సాధనే ధ్యేయంగా అలుపెరగని పోరాటం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. హోదా ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే అంటూ ప్రగల్భాలు పలికిన టీడీపీ, బీజేపీలు..హోదా ఇవ్వకుండా ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేశాయి. ఈనేపథ్యంలో రెండేళ్లుగా హోదా కోసం ఎన్నో పోరాటాలు చేసిన వైయస్సార్సీపీ మరింత స్పీడ్ పెంచింది.  వైయస్ జగన్ నెల్లూరు రాక నేపథ్యంలో పార్టీ నేతల్లో నూతనోత్సాహం నెలకొంది. 

ఇప్పటికే తిరుపతి, కాకినాడ, శ్రీకాకుళం, వైజాగ్ లలో యువభేరి కార్యక్రమాలు నిర్వహించి...ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి ప్రతిపక్ష నేత వైయస్ జగన్ యువతకు దిశానిర్దేశం చేశారు. ఈక్రమంలోనే ఇవాళ నెల్లూరులో జరగనున్న యువభేరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ  ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న వైయస్ జగన్ కు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.

పార్టీ నేతలు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మేకపాటి గౌతంరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, సంజీవయ్య, భూమన కరుణాకర్ రెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి తదితరులు వైయస్ జగన్కు స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా వైయస్ జగన్ నెల్లూరులోని యువభేరి ప్రాంగణానికి చేరుకున్నారు. 

Back to Top