డబ్బుల పంపిణీని అడ్డుకోలేకపోయారు మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

నంద్యాల: ఉప ఎన్నికలో అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసిందని, పోలీసులు అడ్డుకోలేకపోయారని వైయస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యుడు మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఎన్నికలో వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని ప్రలోభాలకు గురి చేసిన వైయస్‌ జగన్‌ తరఫున శిల్పా మోహన్‌ రెడ్డికి అండగా నిలిచారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే తమ్ముడు డబ్బులు పంచుతుండగా తను అడ్డుకోగా దాడికి ప్రయత్నించారని మండిపడ్డారు. అధికార పార్టీ ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా నంద్యాలలో మేం తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తామని రాజగోపాల్‌డ్డి ధీమా వ్యక్తం చేశారు.

Back to Top