డబ్బు మూటలతో కాంగ్రెస్, టీడీపీ సిద్ధం: జగన్

 

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్రంలో కూలీల ఉపాధి కరువయిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో శనివారం రాత్రి జరిగిన సభలో అశేషంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఉప ఎన్నికలకు కాంగ్రెస్, టీడీపీ డబ్బు మూటలతో సిద్ధమవుతున్నాయని ఆరోపించారు. అప్యాయత, అనురాగాలకు డబ్బుతో వేలం వేయాలని చూస్తున్నాయని చెప్పారు. రామచంద్రపురానికి వళ్లీ వస్తానని, రెండు రోజులు పర్యటిస్తానని హామీయిచ్చారు. రైతులు, పేద కూలీల కోసం పదవి వదులుకున్న పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ను ఉప ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను జగన్ కోరారు.

 

Back to Top